మనలో అధిక శాతం మందికి ఏదో ఒక అనారోగ్య సమస్య కచ్చితంగా ఉంటుంది. అందుకుగాను రక రకాల మందులను వారు వాడుతుంటారు. అయితే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఒకే మందు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా. అవును నిజమే.. అయితే అలాంటి అద్భుతమైన ఔషధాన్ని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఆ ఔషధాన్ని తయారు చేసుకుని దాన్ని నిత్యం తాగవచ్చు. దీంతో అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే…
250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్లజీకర్ర తీసుకుని వాటిని విడివిడిగా పెనంపై వేసి వేపుకోవాలి. అనంతరం మూడింటినీ కలిపి మిక్సీలో వేసి పొడిగా పట్టుకోవాలి. ఆ పొడిని గాలి చొరబడకుండా సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇక నిత్యం రాత్రిపూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఆ పొడిని 1 టీస్పూన్ మోతాదులో కలిపి తాగాలి. ఆ తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోరాదు. ఇలా 3 నెలల పాటు ఆ మిశ్రమాన్ని తాగవచ్చు. తరువాత అవసరం అనుకుంటే 15 రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 నెలల పాటు ఆ మిశ్రమాన్ని తాగవచ్చు. దీని వల్ల కింద తెలిపిన లాభాలు కలుగుతాయి.
* శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
* శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రక్తం శుద్ధి అవుతుంది.
* ఎముకలు, కండరాలు, కీళ్లు దృఢంగా మారుతాయి.
* డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
నోట్: పైన తెలిపింది సహజ సిద్ధమైన మిశ్రమమే అయినప్పటికీ.. ఎవరైనా సరే.. డాక్టర్ సూచన మేరకు వాడితే ఉత్తమం.