గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తూ గొడవ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ బాపూజీ హై స్కూల్ పక్క వీధిలో చోటుచేసుకోగా.. శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
రాత్రిపూట మందు తాగుతూ కాలనీ వాసులకు కొందరు యువకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 9 దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని మహిళలు జంకుతున్నారు.
కుత్బుల్లాపూర్‌లో మందుబాబుల వీరంగం
జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ బాపూజీ హై స్కూల్ పక్క వీధిలో రాత్రిపూట మందు తాగుతూ కాలనీ వాసులకు భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులు pic.twitter.com/38nET71DjP
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2025
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి వెంకటేశ్వర నగర్ బాపూజీ హైస్కూల్ పక్కవీధిలో అర్ధరాత్రి మందుబాబుల వీరంగం.
మద్యం సేవించి వెళ్తూ స్థానికులను బూతులు తిడుతూ నానా హంగామా.
కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేసినా పట్టించుకోని పోలీసులు. pic.twitter.com/oDj8DTAa3N— ChotaNews App (@ChotaNewsApp) April 5, 2025