ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇవాళ భద్రాచలం వెళ్లాల్సి ఉండేది. రేపు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్కరోజూ ముందుగానే ఖమ్మం జిల్లాకు వెల్తున్నారని ముందుగా ప్రకటించారు.

ఇక భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారని వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల కు హైదరాబాద్ లోని మాదాపూర్ లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి.. సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుకోనున్నారని పవన్ కళ్యాణ్ టూర్ ఫిక్స్ చేశారు. కానీ చివరికి ఏ పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు అయింది.