నగరంలో జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్ షేక్ బిలాల్‌ను ఆరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. మాదాపూర్ ఏరియాలో డ్రగ్ సప్లయ్ చేస్తుండగా నిందితుడు షేక్ బిలాల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ క్రమంలో నిందితుడు నుంచి రూ.12 లక్షలు విలువ చేసే 23 కిలోల గంజాయి, 15 గ్రాముల ఎండీఎంఏ, హాష్ అయిల్ కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా అతడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇప్పటికే అందులో 45 మంది ఐటీ ఉద్యోగులను గుర్తించామని డీసీపీ వినీత్ వెల్లడించారు. కాగా, గతంలో ఎన్‌డీపీఎస్ కేసులో నిందితుడు షేక్ బిలాల్ జైలుకు కూడా వెళ్లాడు.