టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో కొన‌సాగుతున్న విచార‌ణ‌..!

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌ కొన‌సాగుతూనే ఉంది. ఇప్పటికే ముగ్గురు సినీ ప్రముఖలకు ఈడీ విచారించింది. పూరి జగన్నాథ్ ను 10 గంటలు, ఛార్మి ని 8 గంటలు, రకుల్ 6 గంటలు ఈడీ విచారించింది. ఈ ముగ్గురు తారల ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు స్టేట్ మెంట్ లను ఈడీ ప‌రిశీలించింది. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసును ఢిల్లీ ఈడీ బృందం విచారిస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నివేదిక, ఎన్సీబి రిపోర్ట్ ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ విచారిస్తోంది.

టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింకులు బదిలీ అయిన నగదు లావాదేవీలపై ఈడీ ప్ర‌శ్న‌లు కురిపిస్తోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 22 వరకు సినీ తారలను ఈడీ విచారించనుంది. 2016 నుండి బ్యాంకు లావాదేవీలను ఈడీ ప‌రిశీలిస్తోంది. సెప్టెంబర్ 8 న ఈడీ ముందు దగ్గుబాటి రానా హాజ‌రుకానున్నారు.