తిరుమల మాఢ వీధుల్లో మద్యం తాగి వ్యక్తి హల్చల్

-

హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఓ మందు బాబు రెచ్చిపోయాడు.ఏకంగా శ్రీవారిని ఊరేగించే మాఢ వీధుల్లో నానా రచ్చ చేశాడు. మందు బాబు మాఢ వీధుల్లో గట్టిగా అరుస్తూ నానా హంగామా సృష్టించినట్లు తెలిసింది.

‘నేను లోకల్..మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా’ అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందే రెచ్చిపోయాడు’అయితే, తిరుమలకు ఆ వ్యక్తి మద్యం తాగి ఎలా వచ్చాడు? అన్న వివరాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల కొండపైనా మద్యం అమ్మకాలు నిషేధించిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ కూడా చాలా టైట్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోనూ సదరు మందు బాబు కొండపైకి ఎలా వచ్చాడనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news