వినాయకుడికి అత్యంత ప్రియమైనవి మోదకాలు. వినాయక చవితి రోజున ఆ ఏకదంతునికి మోదకాలు నైవేద్యంగా పెట్టి ఆయన కృపకు పాత్రులు కావచ్చు. అయితే మోదకాలను డ్రైఫ్రూట్స్‌తో చేయడం ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు :
ఖర్జూరాలు – 1 1/2 కప్పు
బాదం పప్పు – పావు కప్పు
జీడి పప్పు – పావు కప్పు
వాల్ నట్స్ – పావు కప్పు
కిస్‌మిస్ – పావు కప్పు
ఎండు కొబ్బరి – పెద్ద ముక్క
గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్
నెయ్యి – ఒక టీ స్పూన్
తయారు చేసే విధానం :
ఖర్జూరాల్లో గింజలు తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్, ఎండుకొబ్బరిని కూడా చిన్నగా కట్ చేయాలి. ఒక కడాయి పెట్టి బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ ఒక్కొక్కటిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని గోల్డెన్
కలర్ వచ్చేవరకు వేయించాలి. గసగసాలను కూడా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసి ఖర్జూరాలు, కిస్‌మిస్‌లను కలిపి ఐదు నిమిషాల పాటు వేయించాలి. అన్నింటిని కాస్త చల్లరనివ్వాలి. అన్నింటినీ కలిపి గ్రైండ్
చేసుకోవాలి. అయితే మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ కడాయిలో వేసి మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. దీన్ని ఒక ప్లేటులోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ ఎక్కువగా చల్లారితే మోదకాలు చేయడానికి రావు. కొద్ది
కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చిన్న లడ్డూల్లా చేయాలి. వీటిని మోదక్ ప్రెస్‌లో పెట్టి ఒత్తాలి. ఆ మెషిన్ లేని వాళ్ళు లడ్డూల్లాగే ఉంచేసుకోవచ్చు. తీపి.. డ్రై ఫ్రూట్స్ మోదకాలు సిద్ధమైనట్లే!