రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా.. దీనిని జూన్ 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డీఎస్సీ పరీక్ష తేదీలు కూడా విద్యాశాఖ ఖరారు చేసింది. జులై 17 నుంచి అదే నెల 31 వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
కాగా, 11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషనన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటిలో SGTలు 6,508, స్కూల్ అసిస్టెంట్స్ 2,629, LP లు 727, PET లు 182 ఉన్నాయి. దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో 220 SAలు, 796 SGT పోస్టులున్నాయి.