చంద్రబాబుకు ఓటు వేస్తే.. వాలంటీర్ వ్యవస్థ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్దం సభలో మాట్లాడారు. ఇప్పటికే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించాడు. ఇక జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి. రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదు.
జగన్ పేరు చెబితేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయి.’ లంచాలు, వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు అన్నారు.