దుబ్బాకలో బీజేపీకి క్యాడర్ లేనప్పటి నుండి ఒక కార్యకర్తగా పనిచేశానని, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడం బాధాకరమని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. రఘునందన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారాయన. రెడ్డి సామాజిక వర్గానికి నియోజకవర్గంలో మొదటి నుంచి మంచి పట్టుందని దుబ్బాక టిక్కెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని కోరారు. మరోవైపు కమలాకర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ అధిష్టానం.
దుబ్బాక బీజేపీలో అంతర్గత పోరు..కీలక నేత పై వేటు…!
-