సీతారామం జోడీ… సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి.. నిజమేనా!

-

ఇటీవల విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘సీతారామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మించారు. సీతగా మృణాల్‌, రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ జంట అద్భుత కెమిస్ట్రీతో క్లాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ జంట మరో తెలుగు సినిమా కోసం కలిసి నటిస్తున్నారనీ.. ఆ చిత్రాన్ని కూడా అశ్వనీదత్‌ నిర్మించనున్నారనే వార్త తెగ ప్రచారమవుతోంది. దీని కోసం చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే సీతారామం అభిమానులకు ఇది పండగ లాంటి వార్తే.

ఆగస్టు 5న తెలుగులో విడుదలైన సీతారామం ఇక్కడ అఖండ విజయాన్ని అందుకుని సెప్టెంబర్‌ 2న హిందీ ప్రేక్షకులను పలకరించింది. అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘మహానటి’ సినిమా తర్వాత తెలుగులో దుల్కర్‌కు ఇది రెండో సినిమా కాగా.. మృణాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.

ఈ రొమాంటిక్‌ డ్రామా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై డిజిటల్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో రష్మిక మందన, సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version