Dunki Movie : రాష్ట్రపతి భవన్‌లో ‘డంకీ’ స్పెష‌ల్ స్క్రీనింగ్…..

-

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ ,జవాన్ సినిమాలతో సూపర్ హిట్ సాధించాడు. ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ తాజాగా డంకి చిత్రంతో హ్యట్రిక్ అందుకున్నాడు.స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ప్రస్తుతం ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం కలెక్షన్స్ మొదటగా యావరేజ్ గా వచ్చినప్పటికీ… మెల్లిమెల్లిగా వసూళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు డంకి చిత్రం 157 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

 

ఇదిలా ఉండగా… తాజాగా డంకి చిత్రానికి అరుదైన గౌరవం లభించింది.ఈ సినిమాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక‌ రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక స్క్రీనింగ్ను ఏర్పాటు చేసి అక్క‌డి సిబ్బందికి చూపించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ విషయం తెలిసిన షారుక్ ఖాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news