లోకేష్ తీరుపై అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. కారణం అదేనా..??

-

మరో మూడు నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టిడిపిలో టిక్కెట్ గోల స్టార్ట్ అయింది.. ప్రజా బలం కంటే.. ఆర్థిక బలం ఉన్నవారికె ఈసారి టిడిపిలో టిక్కెట్లు లభిస్తాయని పార్టీలో చర్చ నడుస్తోంది.. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు సీనియర్లను పిలిపించి వచ్చే ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు పెట్టుకోవాలని సూచిస్తున్నారట.. అలా ఖర్చు చేయలేని పక్షంలో.. టిక్కెట్ రాదని.. ప్రత్యయంగా వీరి అభ్యర్థిని బరిలోకి దింపుతామని పరోక్షంగా చెబుతున్నారట.. ఈ వ్యవహారం నచ్చని కొందరు సీనియర్లు చంద్రబాబు వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని నేతలు చెబుతున్నారు..

టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు సైతం ఇది అనుభవం ఎదురైందట.. తన పట్ల చంద్రబాబు నాయుడు పాజిటివ్ గా ఉన్నప్పటికీ.. లోకేష్ మాత్రం తన టికెట్ కి ఎసరు పెడుతున్నారని అనుచరుల వద్ద వాపోతున్నారట.. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బును ఈసారి ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని.. లేదంటే టికెట్ రాదని లోకేష్ కరాకండిగా చెబుతున్నారని టాక్ వినిపిస్తుంది..

35 కోట్లు డిపాజిట్ చేస్తేనే టికెట్ ఉంటుందని.. సర్వే ఆధారంగా మైలవరంగానీ లేదంటే మరో నియోజకవర్గ కేటాయిస్తామని దేవినేని ఉమా కి లోకేష్ చెప్పారని పార్టీలో చేర్చి నడుస్తుంది.. లోకేష్ మాటలు విన్నా దేవినేని ఉమా చంద్రబాబును ఆశ్రయించారట.. ఆయన కూడా అదే మాట చెప్పడంతో.. దేవినేని డైలమాలో పడ్డారని నియోజకవర్గంలో నేతలు చర్చించుకుంటున్నారు. ఓటమి ఖాయంగా కనిపిస్తున్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడమా, లేదంటే పోటీకి దూరంగా ఉండి ఎమ్మెల్సీ ఇస్తే తీసుకోవడమా అనే అయోమయంలో దేవినేని ఉమా ఉన్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.. లోకేష్ దెబ్బకి సీనియర్లు అందరూ షాక్ లో ఉన్నారట..

Read more RELATED
Recommended to you

Latest news