బీఆర్ఎస్ నాలుగు ముక్కలు కావడం ఖాయం.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ నేతలపై ఆర్ అండ్ బి అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మరో 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని… అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పలుగా మార్చిందని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన టిఆర్ఎస్ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై వేసిన సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రెండు మూడు నెలల్లోనే రానుందని స్పష్టం చేశారు. ఇకపై బీఆర్ఎస్ ఉండగానే ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడంతో పలువురు బి ఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి చేరికకు కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నారని హస్తమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే గోడ దూకేందుకు కూడా రెడీగా ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news