ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది – రేవంత్ రెడ్డి

-

ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ లో రెవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో సంపూర్ణ మార్పు కోసం ఈ యాత్ర చేపట్టామన్నారు. ఉద్యమకారులు తెలంగాణ వస్తే మార్పు వస్తుందనుకున్నారని, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయనుకున్నారని కానీ అవేవీ జరగలేదన్నారు.

జర్నలిస్టులు జీవితాల్లో మార్పు రావాలనుకుంటున్నారుని అన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదన్నారు రేవంత్ రెడ్డి. మార్పు రావాలని ప్రతిఒక్కరు కోరుకుంటున్నారని.‌.. కాబట్టి మార్పు తీసుకురావడానికి “హాథ్ సే హాథ్ జోడో” యాత్ర చేపట్టామన్నారు. ఎవ్వరు చెప్పింది కేసిఆర్ వినడని… ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు.

రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ స్పూర్తితో మేడారం నుంచి ఈ యాత్ర చేపట్టామన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆడపిల్ల ఎదురు రావాలనుకుంటామని.. సీతక్క ఆడబిడ్డగా ఆమే ప్రాతినిధ్యం వహించే మేడారం నుంచి ఈ పాదయాత్రను మొదలుపెట్టామన్నారు. చంద్రశేఖర రావు పీడ విరగడానికే ఈ యాత్ర చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version