బిర్యానీ ఆకుల నీళ్లతో బరువు తగ్గడంలో నిజమెంత..?అసలు తాగొచ్చా..?

-

బిర్యానీల్లో వాడే ఆకు అందరూ బిర్యానీ, పులావ్‌ చేసేటప్పుడు మాత్రమే వాడతారు.. కానీ బిర్యాని ఆకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? అయితే బిర్యానీ ఆకులతో తయారు చేసే మిశ్రమాన్ని తాగితే అధిక బరువును కేవలం 3 వారాల్లోనే తగ్గించుకునేందుకు వీలుంటుంది.

బిర్యానీ వాటర్‌ ఎలా చేయాలంటే..

ఒక పాత్రలో 1 లీటర్‌ నీటిని తీసుకోవాలి. ఆ నీటిని బాగా మరిగించాలి.
నీరు బాగా మరిగాక అందులో 1 చిన్న దాల్చిన చెక్క, 5 బిర్యానీ ఆకులు వేసి స్టవ్‌ను సన్నని మంటలో పెట్టి.. మరో 5 నిమిషాల పాటు నీటిని బాగా మరిగించాలి.
స్టవ్‌ ఆర్పి ఆ మిశ్రమంలో ఒక నిమ్మకాయను పూర్తిగా రసం పిండాలి.
తరువాత అందులో 3 టీస్పూన్ల తేనెను వేసి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి.

డైలీ వద్దు..

ఈ మిశ్రమాన్ని వారంలో వరుసగా 4 రోజులు రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. తరువాత 3 రోజులు గ్యాప్‌ ఇచ్చి మళ్లీ ఇంకో వారంలో అలాగే చేయాలి. ఇలా 3 వారాల పాటు చేస్తే రిజల్ట్‌ మీరే గమనిస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి.. వారానికి నాలుగు రోజులు మాత్రమే ఇలా చేయాలి.. డైలీ చేయకూడదు.

వీళ్లు తాగొద్దు..

కిడ్నీ సమస్యలు, నాడీ సంబంధ సమస్యలు ఉన్నవారు, గర్భిణులు వీటిని ఫాలో కాకూడదు.. మిశ్రమాన్ని తీసుకోగానే ఏవైనా సమస్యలు అనిపిస్తే వెంటనే మిశ్రమం తీసుకోవడాన్ని ఆపేయాలి. ఈ మిశ్రమం అందరిలోనూ ఒకేలా పనిచేయాలని లేదు. పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేస్తే.. అది 3 నుంచి 4 కప్పులు అవుతుంది. కనుక ముగ్గురు లేదా నలుగురు ఈ మిశ్రమాన్ని ఒకేసారి తాగొచ్చు. ఈ వాటర్‌ను తాగడం వల్ల.. శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పురాతన కాలం నుంచి బిర్యానీ ఆకులను పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
బిర్యానీ ఆకుల వల్ల బరువు తగ్గుతారని చాలామంది వినే ఉంటారు కానీ.. ఆ వాటర్‌ను కరెక్టుగా ఎలా చేయాలో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే..పైన చెప్పిన విధంగా చేసి చూడండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version