గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం రోజున ఉదయం పూట.. సుమారు 7:15 నుంచి ఉదయం 8 : 20 మధ్య ఏకంగా మూడు సార్లు భూమి కంపించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులి చింతల మరియు సూర్యాపేటలో భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలను ఎన్జీఆర్‌ఐ నిర్ధారించింది.
రిక్టర్ స్కేలుపై 3 గా భూకంప తీవ్రత నమోదైందని ఎన్జీఆర్‌ఐ స్పష్టం చేసింది. అటు సూర్యాపేట జిలా పరిసరాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది ఎన్జీఆర్‌ఐ. పులిచింత సమీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3 నమోద అయిందని పేర్కొన్న ఎన్జీఆర్‌ఐశాస్త్రవేత్తలు… సూర్కాపేట జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో రిక్టర్ రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత వరుసగా… 2,3 మరియు 2.7 గా నమోదు అయినట్లు వివరించారు. ఈ భూ ప్రకంపనలు కారణంగా ఈ రెండు జిల్లాల ప్రజలు ఒక్క సారిగా ఉలక్కిపడ్డారు.