రాజస్తాన్ జైపూర్ ప్రాంతంలో ఉలిక్కిపడింది. ఈరోజ ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు వాయువ్యంగా 92 కిలోమీటర్ల దూరంలో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీంతో ప్రకంపన ధాటికి ప్రజలు భయాందోళన చెందారు.
ఇదిలా ఉంటే నిన్న జమ్మూలోని కాట్రా ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల ఆఫ్గన్ సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5 కన్నా అధిక తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనులు జమ్మూ కాశ్మీర్ తో పాటు ఢిల్లీలో కూడా కనిపించాయి. స్వల్పస్థాయి ప్రకంపనలతో ప్రజలు కలరవపడ్డారు. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. తక్కువ స్థాయిలో భూప్రకంపనలు రావాడంతో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు.