మహారాష్ట్రలో రెండు భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఈ రోజు సాయంత్రం పాల్ఘర్ ప్రాంతంలో 5:15 అలాగే 5:28 సమయంలో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపణ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5, 3.3 తీవ్రత నమోదైనట్లు.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తో పాటు, పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ప్రకంపనలను ధృవీకరించింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి నష్టం జరిగిందనే సమాచారం తెలియలేదు.
ఇదిలా ఉంటే. మహారాష్ట్రలో చివరి సారిగా ఫిబ్రవరిలో స్వల్ప భూకంపం సంభవించింది. మహారాష్ట్రలోని హింగోలిలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై 3.1గా భూకంప తీవ్రత నమోదైనట్లు తెలిపారు. ఫిబ్రవరి 5న ఉదయం 8.12 నిమిషాలకు చోటు చేసుకున్న భూప్రకంపనలు.. భూకంప కేంద్రం నుండి 125 కిలోమీటర్ల మేర భూమి కంపిందని వెల్లడించారు. కాగా, మహారాష్ట్రలో చోటు చేసుకన్న ఈ భూకంపం వల్ల.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కూడా భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.