క్యూఆర్ కోడ్ ని జెనరేట్ చెయ్యాలా..? అయితే వీటితో ఈజీగా జెనరేట్ చెయ్యండి..!

-

చాలా వాటికి క్యూఆర్ కోడ్ వుంటుంది. దీనిని స్కాన్ చేసి మనం ఈజీగా సమాచారం తెలుసుకోవచ్చు. పుస్తకాల, డిజిటల్ చెల్లింపులు అయినా లేదంటే ఏదైనా ప్రొడక్ట్స్ అయినా సరే మనం ఈజీగా స్కాన్ చేసుకోవచ్చు.

 

దీనితో మనం యుఆర్ఎల్ వంటి తదితర పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీరు కూడా ఏదైనా కారణంతో క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ వెబ్సైట్ ద్వారా ఈజీగా క్యూఆర్ కోడ్ ని జెనరేట్ చెయ్యొచ్చు. అయితే మరి ఆ వెబ్సైట్స్ గురించి చూద్దాం.

క్యూఆర్ కోడ్ మంకీ:

ఈ వెబ్సైట్ ద్వారా క్యూఆర్ కోడ్ ని పూర్తి ఉచితంగా జనరేట్ చేసుకోవడానికి అవుతుంది. యుఆర్ఎల్, ఈ మెయిల్, టెక్స్ట్, వైఫై, డిజిటల్ కరెన్సీ చెల్లింపులు వంటి వాటికోసం ఈ వెబ్సైట్ ద్వారా మనం క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకోవచ్చు. మీరు మొదట కంటెంట్ ని ఎంటర్ చేసి ఆ తర్వాత ఏ రంగులో కోడ్ ని పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు లోగో డిజైన్ సెలెక్ట్ చేసుకుని క్యూఆర్ కోడ్ కోసం క్లిక్ చేయగానే అతి తక్కువ సమయంలోనే జనరేట్ అవుతుంది.

క్యూఆర్ స్టఫ్:

క్యూఆర్ కోడ్ ని ఈజీగా ఈ వెబ్సైట్ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు. మొదట రకాన్ని ఎంచుకోవాలి ఆ తర్వాత సమాచారాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత స్టైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా మీరు క్యూ ఆర్ కోడ్ ని సృష్టించుకోవచ్చు.

క్యూఆర్ జనరేటర్:

క్యూఆర్ కోడ్ ని నచ్చిన రంగు ఫ్రేమ్ తో తయారు చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజీ లను కూడా ఇది సృష్టిస్తుంది. ఇలా ఈజీగా మీరు క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version