ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు బ్యాలెన్స్ ని ఈజీగా తెలుసుకోవచ్చు..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకి ఎన్నో సేవలని అందిస్తోంది. అయితే ఉద్యోగుల PFని ఉపసంహరించడం మొదలు ఎన్నో మార్పులని చేసింది. అలానే మూడు పథకాలను కూడా అందుబాటులో ఉంచింది. EPF స్కీమ్ 1952, పెన్షన్ స్కీమ్ 1995 (EPS), ఇన్సూరెన్స్ స్కీమ్ 1976 (EDLI) అనేవి PF, పెన్షన్ కవరేజీ కింద మూడు స్కీమ్స్ వున్నాయి.

వడ్డీ రేటు 8.10% గా వుంది. ఇక మీ మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇబ్బంది పడక్కర్లేదు. ఈజీగా మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసేయచ్చు. ఇక మరి ఎలా ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసేయచ్చు అనేది ఇప్పుడే చూద్దాం.

మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపడం ద్వారా బ్యాలెన్స్ ని తెలుసుకోవచ్చు.
7738299899 ఫోన్ నెంబర్ కి “EPFOHO UAN” అని మీరు మెస్సెజ్ చేయాలి.
అలానే మిస్డ్ కాల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. 9966044425కు మిస్డ్ కాల్ ఇచ్చి మీ బ్యాలెన్స్ ని తెలుసుకోవచ్చు.
epfindia.gov.in లాగిన్ అయి కూడా తెలుసుకోవచ్చు. మెంబర్ ఇ-సేవా పోర్టల్‌లో UAN నంబర్, పాస్‌వర్డ్‌ని ఇచ్చేసి మీ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయవచ్చు.
అదే విధంగా ఉమంగ్ పోర్టల్ యాప్ ద్వారా కూడా మీరు మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version