వింత: 30 నిమిషాల్లోనే 30 కేజీల ఆరెంజ్​లు తిన్నారు…!

-

దేవుడా 30 నిమిషాల్లో 30 కేజీల ఆరెంజ్​లు తినడం మాటలా…? ఒకటి రెండు తింటేనే కడుపు ఫుల్ అయిపోతుంది. అలాంటిది 30 కేజీల ఆరెంజ్​లు తిన్నారు. అసలు ఎందుకు 30 కేజీల ఆరెంజ్ లని తిన్నారో చూస్తే షాక్ అవుతారు. ఇక అసలా విషయం లోకి వస్తే.. మనం విమానాల్లో వెళితే లగేజీ చార్జీలను వేస్తారు. అయితే ఇదే చిక్కు ఇతనికి వచ్చింది. లగేజీ చార్జ్ ఎక్కువవుతుందని నలుగురు ప్రయాణికులు ఏకంగా అర గంటలో 30 కేజీల నారింజ పండ్లు తినేశారు. ఎంత వింతో కదా..!

దీని వివరాలని చూస్తే… చైనా యునాన్ ప్రావిన్స్​లోని కున్మింగ్ ఎయిర్​పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. వాంగ్ మరొక ముగ్గురితో కలిసి కున్మింగ్​కు బిజినెస్ ట్రిప్ వెళ్ళాడు. అయితే అక్కడ 50 యువాన్లకే 30 కిలోల ఆరెంజ్​లు వచ్చే సరికి రేటు తగ్గువగా ఉంది అని అమాంతం కొనేసాడు. ఇంకేం ఉంది ఎయిర్ పోర్టుకు వచ్చాక షాక్ తగిలింది.

ఈ లగేజీ ని తమ వెంట తీసుకెళ్లాలంటే ఏకంగా 300 యువాన్లు పే చేయాలన్నారు. దీనితో వీళ్ళు వేస్ట్ చేయకుండా అక్కడే నిలబడి నలుగురు 30 నిమిషాల్లోనే 30 కేజీల పండ్లు తినేశారు. కొందరి నోళ్లకు ఏకంగా పుండ్లు పడ్డాయి. అక్కడ చూసిన వాళ్ళు అంత షాక్ అయ్యారు. ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ప్యాక్ చేయించుకోకపోతే.. నలుగురు నాలుగు భాగాలుగా చేసుకొని క్యాబిన్​లో తీసుకెళ్లొచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version