ఈటలకు బ్రేకులు వేయడానికే?

-

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి…ఎప్పుడైతే బీజేపీలో చేరి..హుజూరాబాద్ బరిలో గెలిచారో అప్పటినుంచి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లక్ష్యంగా దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. తనని టార్గెట్ చేసిన కేసీఆర్‌ని ఖచ్చితంగా గద్దె దించాలనే లక్ష్యంగా ఈటల పనిచేస్తున్నారు. పైగా బీజేపీలో చేరికల కమిటీ కన్వీనర్ గా ఉంటూ..టీఆర్ఎస్ పార్టీ నేతలతో తనకున్న పాత పరిచయాల ద్వారా..ఆ పార్టీ నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలని బీజేపీలోకి తీసుకొచ్చారు…ఇంకా పలువురు నాయకులని బీజేపీలోకి తీసుకురావాలని ఈటల ట్రై చేస్తున్నారు.

ఇలా దూకుడుగా వెళుతున్న ఈటలకు టీఆర్ఎస్ బ్రేకులు వేయలేని పరిస్తితి. రాజకీయంగా ఏ విధంగానూ చెక్ పెట్టలేకపోతున్నారు. కానీ అధికార బలంతో ఈటలకు బ్రేకులు వేయాలని టీఆర్ఎస్ చూస్తుంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ని ఉద్దేశించి ఈటల మరమనిషి అని వ్యాఖ్యానించారు.

తాజాగా అసెంబ్లీ సమావేశాలను కేవలం 10 నిమిషాల్లోనే ముగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేసి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మర మనిషి లాగా వ్యవహరిస్తున్నారని, సీఎం చెప్పింది చేయడం తప్ప.. స్పీకర్‌‌ పోచారానికి వేరే పని లేదని ఫైర్ అయ్యారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సభాసంప్రదాయాలని పాటించడం లేదని విమర్శించారు.

బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా సరే..వారిని బి‌ఏ‌సి సమావేశానికి పిలవడం లేదు. ఇక స్పీకర్‌పై ఈటల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రులు ఫైర్ అవుతున్నారు. స్పీకర్‌కు ఈటల క్షమాపణ చెప్పాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈటలపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి ఎక్స్‌పెల్‌ చేయాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అంటే దూకుడుగా ఉన్న ఈటలకు ఇలా బ్రేకులు వేయాలని టీఆర్ఎస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఈటలకు సానుభూతి పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version