ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు: వికాస్ రాజ్

-

తెలంగాణాలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరగనున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి.. ఒకటి అధికార BRS, కాంగ్రెస్ మరియు బీజేపీ లు రేస్ లో ఉన్నాయి. ఈ రోజుతో రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రచారం చేయాల్సిన బాధ్యత మరియు సమయం ముగిసిపోయింది, రేపు ఒక్క రోజు అందరూ ప్రశాంతంగా ఎల్లుండి జరగబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తూ కూర్చోనున్నారు. ఎన్నికల సంఘం నుండి విడుదల అయిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇంకా ఈ ఎన్నికలలో మొత్తం 1 .40 లక్షల సిబ్బంది పాల్గొనబోతున్నారు. సిబ్బందికి నిర్దేశించిన రూట్ లలో మాత్రమే ప్రయాణించాలి..

హోమ్ ఓటింగ్ లో మొత్తం 27175 మంది పాల్గొనబోతున్నారు మరియు ప్రతి నియోజకవర్గంలోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాలు అన్నటినీ ఎన్నికల అధికారి వికార్ రాజ్ తెలియచేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన నిలబడనున్నారు అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news