వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడని తెలుగుదేశం పార్టీ నేతలు పదే పదే ఊదరగొడుతున్నారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మాచర్ల నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సంఘం ఏడెనిమిది చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని చెబుతోంది, కానీ ఒక్క మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది? అని గురజాల ఎమ్మెల్యే ప్రశ్నించారు.
పాలువాయి గేట్ పోలింగ్ బూత్ లో మా కార్యకర్తలపై మొదటగా జరిగిన దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ మొత్తం ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.పోలింగ్ సరళిలో ఒక పార్టీ వారు చేసిన దాడిని మాత్రమే బయపెట్టారు. గురజాల, మాచర్ల పోలింగ్ సరళిపై మేము హైకోర్టును ఆశ్రయిస్తాం ఆయన అన్నారు. ఏం జరిగినా మాచర్లలో రామకృష్ణారెడ్డి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు.మాచర్లలో అల్లర్లకు ప్రధాన కారణం జూలకంటి బ్రహ్మారెడ్డే అని అన్నారు. మాచర్ల, గురజాలలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియ వీడియో క్లిప్పింగ్స్ ఎందుకు బయటకు రాలేదు.అందరినీ సమానంగా చూడకపోతే ఎన్నికల సంఘం విశ్వసనీయత పోతుంది అని తెలిపారు.