BREAKING : పంజాబ్ సీఎం మేనల్లుడు ఇసుక మాఫియా కేసులో అరెస్ట్

-

మరికొన్ని రోజుల్లోనే పంజాబ్ రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో… అన్ని పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఇక పంజాబ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ ఓటమి తప్పదని కూడా సమాచారం అందుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మేనల్లుడు భూపీందర్‌ సింగ్‌ హనీని అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం అర్థరాత్రి మనీలాండరింగ్‌ కింద అరెస్టు చేసింది.

ఈ కేసు లో ఈడీ అధికారులు అతడిని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. అంతేకాదు భూపీందర్ కార్యాలయంలో రూ.7.9 కోట్లు, అతని సహచరుడు సందీప్ కుమార్ వద్ద రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

స్వాధీనం చేసుకున్న డబ్బుల గురించి భూపిందర్ సింగ్ ‘హనీ’ని, అలాగే సందీప్‌తో సహా అతని ఇద్దరు సహచరులను మళ్లీ ప్రశ్నించనున్నారు ED అధికారులు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో భూపిందర్ సింగ్, కుద్రత్‌దీప్ సింగ్, సందీప్ కుమార్ ప్రొవైడర్స్ ఓవర్‌సీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా ఉన్నారని తేలింది. ఇక కేసు గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version