బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా అనేది కలకాలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఈడి దూకుడు చూపిస్తుంది. బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది ఈడి. బ్యూటిషన్ ,టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చారు పలువురు యువతులు. ఇలా వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు యువతులు. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయిస్తుంది ఓ ముఠా.
తాజాగా ఖైరతాబాద్ సనత్ నగర్ చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు అయ్యాయి. 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్టు చేసారు పోలీసులు. హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకొని వ్యభిచారం చేస్తున్నారు యువతులు. బంగ్లా నుండి బాలికలను యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయిస్తుంది ముఠా. బంగ్లా యువకులు ఓలా ఉబర్ డ్రైవర్ గా పనిచేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నారు యువతి యువకులు.