ఈ మధ్యన మనీ లాండరింగ్ మరియు ఇతర నేతలతో సంబంధం ఉన్న సీఎం లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన సిబిఐ, సీఐడీ, ఈడీ లాంటివి విచారణ చేయడం చూస్తూనే ఉన్నాము. కాగా తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజు తీసుకోవడంతో ఈడీ విచారణ చేపట్టనుంది. గత సంవత్సరం అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరు అవ్వాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆ సమయంలో వివిధ కారణాలతో హేమంత్ సొరేన్ హాజరు కాలేదు. అయితే తాజాగా మరోసారి ఈడీ నోటీసులను ఇచ్చింది.. రాంచి లోని ఈడీ కార్యాలయానికి హాజరు అయితే మనీ లాండరింగ్ కేసులో సీఎం స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తామని ఈడీ నోటీసులో పేర్కొంది.
మరి ఈ సారి అయినా సీఎం హేమంత్ సొరేన్ ఈడీ విచారణకు హాజరు అవుతాడా లేదా అన్నది తెలియాలంటే మరో అయిదు రోజుల వరకు వేచి చూడాల్సి ఉంది.