బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇప్పటికే రిమాండ్ డైరీని సిద్ధం చేశారు. శనివారం ఉదయం రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కవితని కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు.
కాగా,నిన్న ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.