NRI ఆసుపత్రిలో రెండో రోజు ఈడీ సోదాలు

-

మంగళగిరి NRI ఆసుపత్రితో పాటు విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మాన్యువల్, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషంట్ల వివరాలు రికార్డుల్లో చేర్చలేదని ఈడీ గుర్తించింది. అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. NRI నిధులతో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ కట్టించారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో జరుగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు బృందాలు నిర్దేశిత ప్రాంతాలు, సంస్థలు, వ్యక్తుల నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు.

ఎటువంటి సమాచారం బయటకు రానీయడం లేదు. ప్రధానంగా మంగళగిరి వద్ద ప్రసిద్ధి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి లక్ష్యంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో గతంలో కీలకంగా పని చేసిన వారే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో రికార్డులను అధికారులు పరిశీలస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు రెండు బృందాలుగా విడిపోయి రికార్డులు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి కమిటీ సభ్యుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version