ఉప ఎన్నికల ఫలితమో మరేమో కానీ దేశంలో క్రమంగా నిత్యావసరాల ధరలను తగ్గిస్తూ వస్తోంది కేంద్రం. దీపావళి కానుకగా కేంద్రం పెట్రోల్, డిజిల్ రేట్లను రూ. 5, రూ. 10 కి తగ్గించింది. ఇదే విధంగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా రాష్ట్రాల పన్నులను తగ్గించాయి. దీంతో సామాన్యుడిపై పెట్రోల్ భారం తగ్గింది. తాజా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు తగ్గాయి. పామాయిల్ పైరూ. 20, వేరుశెనిగపై రూ. 18, సోయాబీన్ పై రూ. 10, సన్ ఫ్లవర్ పై రూ. 7 తగ్గింది.
గత కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజల పై విపరీతంగా ప్రభావం పడింది. ప్రజలు ఎక్కువగా వాడే సన్ ఫ్లవర్, పామాయిల్, వేరు శెనిగ నూనెల ధరలు లీటర్ కు రూ. 130 పైనే ఉన్నాయి. గతంలో వంద రూపాయల కన్నా తక్కువ ధరకు దొరికే వంట నూనెలు సెంచరీ మార్క్ ను దాటి రూ.150 వైపు పరిగెడుతున్నాయి. తాజాగా తగ్గిన ధరలతో ప్రజలకు కొంతలోకొంత ఉపశమనం లభించనుంది.