జాతి కోసం జాతీయ పార్టీ ప్రారంభిస్తానని కేసీఆర్ చెబుతున్నారు.ఆ విధంగా ఇవాళ ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. రెండు వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు.జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ కు అండగా నిలిచే రాజకీయ శక్తులు ఉన్నాయి.ఇప్పటికే ఆయన కమ్యూనిస్టు పార్టీలతో స్నేహం చేస్తున్నారు.మిగిలిన ప్రాంతీయ పార్టీలనూ ఆయన కలుపుకునేందుకు చూస్తున్నారు.తమిళ నాట స్టాలిన్ ఆయనతో రాకపోవచ్చు.ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు.అప్పుడు డీఎంకే నేతలతో కలిసి కేసీఆర్ పనిచేసే అవకాశాలు కొట్టిపారేయలేం. అదేవిధంగా ఆంధ్రా,తమిళ నాడు సంస్కృతులు వర్థిల్లే పుదుచ్చేరిలో కూడా కేసీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.కనుక అక్కడ కూడా కేసీఆర్ తన హవా చూపించవచ్చు. ఒడిశా,కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ తోనే ప్రయాణించనున్నారు.
ఇక కేసీఆర్ రాకతో ఆంధ్రావని పరిణామాలు మారిపోనున్నాయి.ఒకవేళ ఆయన జాతీయ పార్టీ పెడితే ఆంధ్రావని రాజకీయాల్లోనూ ఆయన కీలకం కానున్నారు.ఆవిధంగా తన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది.తెలంగాణలో ఓట్లను చీల్చే బాధ్యత షర్మిల తీసుకుంటే,ఆంధ్రాలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే బాధ్యత కేసీఆర్ తీసుకోనున్నారు.
ఆ విధంగా కేసీఆర్ మళ్లీ ఇటు ఆంధ్రాలోనూ అటు తెలంగాణలోనూ సెంటర్ పాయింట్ కానున్నారు.ఇంకా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కానున్నారు.ఇక కేసీఆర్ కారణంగా ఎక్కువగా లబ్ధి పొందేది జగనే! ఆ విధంగా జగన్ కు కేసీఆర్ ఎంతగానో ఉపయోగపడడం ఖాయం.ఇదే సమయాన చంద్రబాబుకు కేసీఆర్ స్ట్రోక్ తగలడం కూడా ఖాయమే!ఇదే కనుక జరిగితే ఫ్యూచర్ లో టీడీపీ ఇక కోలుకోవడమే అసాధ్యం.ఆ రోజు తెలంగాణ తీసుకువచ్చి కాంగ్రెస్ ను భూ స్థాపితం చేయగా..ఇవాళ జాతీయ పార్టీ పెడితే, తెలుగుదేశం గెలుపు అవకాశాలపై ఎనలేని ప్రభావం చూపడం కూడా తథ్యమే!