మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా..

-

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. 19 నెలల్లో ఇది రెండో సారి కోవిడ్ అటాక్ అయింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నానని.. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించారు. తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే థర్డ్ వేవ్ ప్రభావంతో చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కోవిడ్ బారిన పడ్డారు. పలు రాష్ట్రాల సీఎంలకు కూడా కోవిడ్ సోకింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసులు దిగివస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి లక్షకు దిగువగానే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇండియాలో థర్డ్ వేవ్ పూర్తిగా అంతమైనట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version