ఎడిట్ నోట్: ఎన్నికల వేడి..!

-

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది..ఎన్నికలకు ఇంకా కరెక్ట్ గా ఏడాది లోపే సమయం ఉంది..ముందస్తు ఎన్నికలు జరిగితే..మరో ఆరు నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగిన రెడీగా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇటు అధికార బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. అయితే ఈ ఏడాది మొదట నుంచి ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి.

ఇదే క్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్ మొదట ఆవిర్భావ సభని ఖమ్మంలో ప్లాన్ చేశారు. వాస్తవానికి సభని ఢిల్లీలో పెడదామని మొదట భావించారు. కానీ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో..ఖమ్మం వేదికగా మొదట సభకు ప్లాన్ చేశారు. దాదాపు 5 లక్షల మందితో సభకు ప్లాన్ చేశారు. అలాగే ఈ సభకు ముగ్గురు సీఎంలు వస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు హాజరు కానున్నారు. ఈ సభకు తెలంగాణ నుంచే కాకుండా పక్కనే ఉన్న కర్ణాటక, ఏపీల నుంచి కూడా జనాలని తీసుకురావాలని కారు నేతలు చూస్తున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

అటు బీజేపీ సైతం వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది..కేసీఆర్ సభ రోజే..ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలని బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత అంటే 19వ తేదీన మోదీ తెలంగాణకు వచ్చి పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో మోదీతో భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా రెండు పార్టీలు ఎన్నికల వేడిని రాజేశాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. 26న నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. కాకపోతే ఈ రేసులో కాంగ్రెస్ కాస్త వెనుకబడి ఉంది. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ తీవ్రంగా నడుస్తుంది. చూడాలి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version