వీరసింహరెడ్డి సినిమా ఫస్ట్ రివ్యూ ఇదే..!

-

బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతి పండుగకు ఏ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోంది అని.. ఈజీగా చెప్పవచ్చని టాలీవుడ్ ట్రేడ్ విశేషకులు చెబుతున్నారు. ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 17 థియేటర్లలో మొదటి డే ప్రదర్శితం కానుంది అని.. తాజాగా సమాచారం అందుతుంది. ఈ సినిమాకు సంబంధించి బుక్ మై షో యాప్ లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. 2 గంటల 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా థియేటర్లలో జనవరి 12వ తేదీన సందడి చేయబోతోంది. ఇకపోతే ఈ సినిమా నిడివి ఎక్కువైనా సరే కంటెంట్ ఆకట్టుకునేలా ఉండనుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తికాగా.. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ కూడా ఇచ్చారని సమాచారం. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ.. పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం .. ఇప్పుడు బాలయ్య అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. సామాన్యంగా ఉమైర్ ఏ సినిమాని ఒప్పుకోడు. అలాంటిది బాలయ్య సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వడంతో బాలయ్య నటన ఈ సినిమాకు హైలైట్ అవ్వతోందని కూడా చెప్పడం గమనార్హం.

ముఖ్యంగా బాలకృష్ణ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తోంది. ఇకపోతే క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలా ఉన్నాయని.. ఈ సినిమాలో బాలకృష్ణ చాలా అద్భుతంగా నటించారు అని ప్రశంసలు కురిపించారు.. వరలక్ష్మి బాలయ్యకు సొంత చెల్లి కాదు అని.. ఆమె నటనే సినిమాకు హైలైట్ గా నిలుస్తోందని సమాచారం. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version