తెలంగాణలో అసలు సిసలు రాజకీయం ఇప్పుడు మొదలు కానుంది…సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. ఇప్పటివరకు రాజకీయం ఒక ఎత్తు…ఇక నుంచి మరొక ఎత్తు అన్నట్లు…తెలంగాణ రాజకీయాలు నడవనున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ద్వారా…రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో క్లారిటీ వచ్చేస్తుంది.
అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కీ రోల్ పోషిస్తున్నారని చెప్పొచ్చు. రాష్ట్రంలో రాజకీయం పోటాపోటిగా నడుస్తున్న తరుణంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి…రాజకీయాన్ని మరింత వేడెక్కించారు. వాస్తవానికి ఈయన ఎప్పటినుంచో కాంగ్రెస్ ని వదిలి…బీజేపీలోకి రావాలని చూస్తున్న విషయం తెలిసిందే…కానీ బీజేపీ అధిష్టానం సరైన సమయం చూసుకుని కోమటిరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చూసింది.
అయితే రేవంత్ రెడ్డి నాయకత్వం నచ్చకే తాను పార్టీకి దూరమయ్యనని కోమటిరెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్‌ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందని, ఏ పార్టీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందో ఆ పార్టీలో ఉంటానన్నారు. భారతదేశం ప్రధాని మోదీ నాయకత్వంలో దూసుకుపోతోందని.. కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అరాచక పాలన పోవాలంటే.. అది మోదీ అమిత్ షా వల్లే సాధ్యమని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
మొత్తానికి తెలంగాణ రాజకీయాలని కోమటిరెడ్డి..కీలక మలుపు తిప్పారు. ఇక నుంచి తెలంగాణలో పోలిటికల్ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.