ప్రారంభమైన బండి సంజయ్ రెండో రోజు ప్రజా సంగ్రామ యాత్ర

-

తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. 2 వ రోజు పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి రచ్చ బండ నిర్వహించనున్నారు బండి సంజయ్. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. ఇక నిన్న యాదాద్రి బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బిజెపి ఎక్కడుంది అని అడిగిన వాళ్లకి పాలమూరులో ఎక్కడుందో చూపించామని.. నెక్స్ట్ ఖమ్మంలో కూడా చూపిస్తామన్నారు. జఫర్సన్ స్కాచ్ మందు కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్.గజేంద్ర సింగ్ షేకావత్ తెలంగాణకు వచ్చే షెడ్యూల్ అనేది మూడు రోజుల ముందే తెలిసిందని.. కానీ కెసిఆర్ షెడ్యూల్ అన్నది మాత్రం ఎవరికీ తెలియదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version