ఎడిట్ నోట్: మోదీ వర్సెస్ కేసీఆర్…!

-

తెలంగాణలో రాజకీయ యుద్ధం మరో స్టేజ్‌కు వెళ్లింది..బి‌జే‌పి, బి‌ఆర్‌ఎస్ ల మధ్య పోరు తీవ్రంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు పేపర్ లీకేజులు..మరోవైపు లిక్కర్ స్కామ్..ఇక తాజాగా టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో బి‌జేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమేయం ఉందని చెప్పి..ఆయనని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు.

ఇలా రచ్చ నడుస్తున్న సమయంలోనే రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. రెండు గంటల పాటు ఆయన రాష్ట్రంలో ఉంటారు. మొదట సికింద్రాబాద్ లో వందే భారత్ రైలుని ప్రారంభిస్తారు..ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ సి‌ఎంగా ఉన్న కే‌సి‌ఆర్…మోదీ పర్యటనలో పాల్గొనాలి. కానీ కే‌సి‌ఆర్..మోదీ ఎప్పుడొచ్చిన పాల్గొనడం లేదు. బి‌జే‌పి, బి‌ఆర్‌ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ వైరంలో భాగంగా కే‌సి‌ఆర్..మోదీ పర్యటనలో ఉండటం లేదు.

ఈ సారి కూడా ఆయన పాల్గొనడం లేదు. అయితే ప్రతిసారి రాష్ట్రానికి వచ్చి పలు అభివృద్ధి పనులు గురించి, బి‌జే‌పి గొప్పతనం గురించి చెప్పి వెళ్లిపోతున్న మోదీ..ఈ సారి కే‌సి‌ఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తారా? లేదా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆ మధ్య రామగుండం పర్యటనకు వచ్చినప్పుడు మోదీ..కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు. సింగరేణిని ప్రైవేటీకరిస్తారన్న ఆరోపణలకు జవాబు ఇవ్వడానికే పరిమితమయ్యారు. కానీ, మారిన రాజకీయ పరిణామాల్లో ఈసారి పరోక్షంగా అయినా విమర్శలకే మోదీ మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సారి ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి కాబట్టి..తెలంగాణలో బి‌జే‌పి గెలుపు దిశగా మోదీ స్పీచ్ ఉండవచ్చు. అలాగే కే‌సి‌ఆర్ సర్కారుపై విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. ఇక మోదీ వెళ్ళాక కే‌సి‌ఆర్ మీడియా సమావేశం పెట్టి కౌంటర్లు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. చూడాలి మోదీ, కే‌సి‌ఆర్‌ల మధ్య రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో నడుస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version