కాంగ్రెస్ లో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఖాయం అయింది. ఆ విధంగా ఆయన ఇకపై అత్యంత అమిత భక్తి భావంతో పనిచేయనున్నారు అని తేలిపోయింది. అంటే దేశంలో అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులలో ఒకరిగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అని భావించి, అధినేత్రి సోనియా పార్టీ పునరుత్థాన బాధ్యతలు అప్పగించడం కొసమెరపు. పార్టీకి ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా వార్తలొస్తున్నాయి.
యువ రాజు అయిన రాహుల్ ను, యువ రాణి అయిన ప్రియాంక ను గెలుపు దిశగా ప్రయాణింపజేయడమే ఆయన ముందున్న లక్ష్యం. ఆ విధంగా చాలా అంటే చాలా ఇంకా చెప్పాలంటే పైకి చెప్పుకోలేని కష్టాలతో సతమతం అవుతూ, ఇబ్బంది పడుతున్న ఆ పార్టీని త్వరలోనే పైకి తీసుకురావడం అధికారంలో తీసుకుని రావడం అన్నవి చకచకా జరిగిపోనున్నాయి
అని కూడా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేపట్టిన ఉదారవాద రాజకీయాల్లో భాగంగా కొంత కోల్పోయింది. కొన్ని తప్పిదాలు కారణంగా బలమైన నేతలు దూరం అయిపోయారు. పార్టీకి అధినాయకత్వమే అతి పెద్ద సమస్య అని తేలిపోయింది. అందుకే వివిధ రాష్ట్రాలో చరిష్మా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోమని పీకే ఉచిత సలహా ఒకటి ఇస్తున్నారు. సాధారణంగా ఆయన సలహాలకు ఛార్జ్ వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఉచితమే ! అందుకే ఉచిత సలహా అని పట్టి పట్టి పలుకుతూ రాయాలి. వాటి గురించే ఇప్పుడు మరియు రేపటి వేళ కూడా మాట్లాడుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ ని లేవనెత్తేందుకు సుశిక్షితులయిన ఇంకా చెప్పాలంటే పార్టీ అంటే విపరీతం అయిన భక్తి మరియు ఆరాధన ఉన్న కోటి మంది కార్యకర్తలను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఆవిధంగా వీళ్లంతా వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్ కోసం పనిచేయాలి. ఇదీ పీకే సూచన. అంతేకాదు గాంధీయేతర నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు, అదేవిధంగా రాహుల్ పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్ గా నియమించేందుకు కూడా ఆలోచించాలని పీకే మరో ఉచిత సలహా కూడా ఇచ్చారు. వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తున్నదే గాంధీ కుటుంబ పాలన అని ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. కానీ అవేవీ వద్దని గాంధీయేతర కుటుంబాలకు చెందిన నాయకులను ప్రోత్సహించాలని పీకే చెప్పడం సాహసమనే చెప్పాలి.
రెండు ఫార్ములాలు ఆయన పార్టీకి సూచించారు. అందులో ఒకటి యూపీఏ ఇంఛార్జ్ పదవి ఒకరికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇంకొకరికి ఇవ్వాలి అని ప్రతిపాదించారు. వీటిలో ఒకటి తప్పకుండా గాంధీయేతర కుటుంబం అయితే మేలు. అదేవిధంగా రాహుల్ ను పార్టీ వ్యవహారాల్లో మరింత క్రియాశీలకం చేయాలి. ప్రియాంకను మరో ఇందిరా గాంధీ అన్న విధంగా ఫోకస్ చేయాలి (షీ ఈజ్ ఎనదర్ వెర్షన్ ఆఫ్ ఇందిరా గాంధీ).. ఇవీ ఆయన చెబుతున్న సలహాలు మరియు సూచనలు. ముందు చెప్పుకున్న విధంగానే ఇవన్నీ ఉచితాలే ! వినేవాడు ఒకడు ఉన్నాడు కనుకనే ఆయన ఈ విధంగా చెప్పడం ఈ కథలో లేదా ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు.