ఎడిట్ నోట్ : నేడు రైతుల ఖాతాల్లోకి పైస‌లు

-

ప‌చ్చ‌ని పంట‌లు, రైతును ఆదుకునే పాల‌కులు, సేద్యానికి స‌రిప‌డా విద్యుత్, వీటితో పాటు అందుబాటులో విత్త‌నాలు, ఎరువులు ఇవే ఇప్పుడు కోరుకునేవి. వాన‌లు కురిసి, రైతు ఆరుగాల శ్రమ‌కు త‌గ్గ ఆర్థిక ప్ర‌యోజ‌నం దక్కితే రైతు త‌ప్ప‌క రాజు అవుతాడు.ఇందుకు ప్ర‌భుత్వాల చొర‌వ కూడా ఎంతో కీల‌కం. ఏటా ఖరీఫ్ వేళ అందించే పంట సాయం అప్పుడు రైతుల‌కు చెల్లించారు యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అదేవిధంగా మ‌రికొంత సాయం చేస్తూ వారికి అండ‌గా నిలుస్తూ.. వీలున్నంత వ‌ర‌కూ రైతుకు ఆర్థిక భారం కానివ్వ‌కుండా సాగు ప‌నులు ముందుకు సాగేలా ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. బీమా ప్రీమియం కూడా చెల్లించేందుకు జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏటా మాదిరిగా వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమా కు శ్రీ‌కారం దిద్దారు.

ఈ నేప‌థ్యాన సాగుకు అండ‌గా నిలిచేందుకు, అదేవిధంగా ఏటా రైతు క‌ష్టానికి త‌గ్గ ఫ‌లం ద‌క్కించేందుకు ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న కృషి దేశానికే ఆద‌ర్శ‌నీయం అన్న‌ది ప‌రిశీలకులు చెబుతున్న మాట. ముఖ్యంగా రైతు భ‌రోసా కానీ, యంత్ర సాయం కానీ ఇలాంటి ప‌థ‌కాలు రైతుల‌ను ఎంతో ఆదుకుంటున్నాయి అని, సేద్యంలో మంచి ఫ‌లితాలు అందుకోవ‌డానికి సహ‌క‌రిస్తున్నాయని సంబంధిత రైతులు అంటున్నారు. అదేవిధంగా ఈ ఏడాది ముంద‌స్తుగానే ఖ‌రీఫ్ సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో తాము సేద్యం ఆశాజ‌న‌కంగానే ఉంటుంద‌ని భావిస్తున్నామ‌ని చెబుతున్నారు.

ఖ‌రీఫ్ సీజ‌న్ ప్రారంభానికి ముందే రైతుల‌కు పెట్టుబ‌డి సాయం (వైఎస్సార్ రైతు భ‌రోసా) అందించి ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆద‌ర్శంగా నిలిచింది. రైతు భ‌రోసాతో పాటు పంటల బీమా అందించేందుకు సిద్ధం అవుతోంది. వైఎస్సార్ ఉచిత పంట‌ల బీమా పేరిట అమ‌ల‌య్యే ఈ ప‌థ‌కం కింద ఇవాళ (జూన్ 14,2022) రైతుల ఖాతాల్లోకి 2,977 కోట్ల రూపాయ‌లు జ‌మ కానున్నాయి.
ఈ ప‌థ‌కం ద్వారా 15.61 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. శ్రీ స‌త్య‌సాయి జిల్లా, చెన్నేకొత్త‌ప‌ల్లి లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులు జ‌మ చేయ‌నున్నారు.

పంట‌ల బీమా పూర్తి వివ‌రాలు ఈ విధంగా
………ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది

  • 2014 – 15 లో ల‌క్షా మూడు వేలమందికి అందిన ప‌రిహారం రూ.132.24కోట్లు
  • 2015 – 16 లో నాలుగు ల‌క్ష‌ల 35 వేల మందికి అందిన ప‌రిహారం రూ.339.70కోట్లు
  • 2016 -17 లో ఎనిమిది ల‌క్ష‌ల 70 వేల మందికి అందిన ప‌రిహారం రూ.954.75కోట్లు
  • 2017 -18 లో ఆరు ల‌క్ష‌ల 77 వేల మందికి అందిన ప‌రిహారం 720.60కోట్లు
  • 2018-19 లో ప‌ది ల‌క్ష‌ల మందికి అందిన ప‌రిహారం రూ.1263.91కోట్లు

(పూర్తిగా చెల్లించ‌లేదు)

  • 2019 -20 లో 6.19 ల‌క్ష‌ల మందికి అందిన ప‌రిహారం రూ.715.84కోట్లు
  • 2020 – 21 లో 9.48 ల‌క్షల మందికి అందిన ప‌రిహారం రూ.1252.18కోట్లు
  • 2021 – 22 లో 15.61 ల‌క్ష‌ల మందికి అందిన ప‌రిహారం 2977.82 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version