ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో దిల్ సుఖ్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 45వేల ఉపాధ్యాయ పోస్టులు, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.

పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులకు ఎవరు పాఠాలు చెప్తారని ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, గుజ్జు కృష్ణ, ఇతర బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.టీచర్ పోస్టులను భర్తీ చేయకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు బయట తిరగలేరని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కాగా, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ తదితర కాలేజీల్లోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లే బీసీ, ఈబీసీలకు కూడా ఫీజులు పూర్తిగా మంజూరు చేయాలని కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version