రాబోయే ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ రాబోయే 6, 7 నెలల్లో అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చించేందుకు ఐదుగురు రాష్ట్ర మంత్రులు ఇవాళ మునుగోడు నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రుల వెంట ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన తరువాతే ఎన్నిలకు వెళ్తామని మంత్రి కేటీఆర్‌ చేస్తామని స్పష్టం చేశారు.

ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం ఐదుగురు మంత్రులు మునుగోడుకు రావడం అరుదైన సందర్భం అని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగురవేశామని చెప్పారు. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకే తామంతా వచ్చామన్నారు మంత్రి కేటీఆర్ . మునుగోడ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే బాధ్యత తమపై సమిష్టిగా ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయే10, 12 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఆలోపే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version