తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రకటన చేసింది. ప్రవేట్ కాలేజీల బంద్ వ్యవహారంపై ఆదివారం అర్ధరాత్రి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిగాయి.

తమ డిమాండ్లు వెనక్కి తీసుకోవాలని.. యధావిధిగా ప్రైవేట్ కాలేజీలను కొనసాగించాలని… డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క… ఇతర అధికారులు కోరారట. భట్టితో చర్చలు జరిగినా… ప్రైవేట్ కాలేజీలు సంతృప్తి చెందలేదని సమాచారం. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు… వెనక్కి తగ్గేది లేదని ప్రవేట్ కాలేజీల యజమాన్యాలు ప్రకటన చేశాయని తెలుస్తోంది. ఆ డిమాండ్లపై ప్రభుత్వం కూడా దిగి రాకపోవడంతో… ఇవాల్టి నుంచి ప్రవేట్ కాలేజీలను… బంద్ చేస్తామని ప్రకటన చేశారు. ఈ తరుణంలోనే.. ఇవాళ్టి నుంచి బంద్ కొనసాగే ఛాన్సు ఉందని అటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ వల్ల నేటి నుండి 1500 కాలేజీలకు తాళాలు పడనున్నాయన్న మాట. అటు 13 లక్షల మంది విద్యార్థులకు సెలవులు రానున్నాయి.