దేవీ నవరాత్రులు.. ఏడుపాయలలో పూజలకు అమ్మవారు దూరం!

-

దేవీ నవరాత్రల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోని దుర్గా భవానీ అమ్మవార్లు గర్భగుడిలో వైభవంగా పూజలు అందుకుంటున్నారు. కానీ,ప్రముఖ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవానీ ఆలయంలోని అమ్మవారు మాత్రం గర్భగుడిలో పూజలు అందుకోవడం లేదు. ఎందుకుంటే ఇప్పటికీ ఏడుపాయల అమ్మవారి టెంపుల్ జలదిగ్బంధంలోనే ఉన్నది.

మంజీరా నది ఏడు పాయలుగా చీలడంతో అందులోని ఒక పాయలో అమ్మవారి ఆలయం కొలువుదీరింది. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ మంజీరా నదికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ఆలయం వరద నీటిలో చిక్కుకుపోవడం పరిపాటిగా మారింది. అయితే, ప్రస్తుతం దసరా వేడుకలలో భాగంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగాల్సి ఉండగా..వరద నీరు అడ్డంకిగా మారడంతో ఉత్సవాలు జరగడం లేదు. దీంతో గర్భగుడి మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, నేడు గాయత్రీదేవి అలంకారంలో ఏడు పాయల అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news