కిడ్నీ స్టోన్స్ ఉంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే.. ఇది మాత్రం అస్సలు తీసుకోవద్దు..!

-

ఈ మధ్యకాలంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కిడ్నీలో రాళ్లు చేరి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలో రాళ్లు చేరినట్లయితే వీటికి దూరంగా ఉండాలి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఉప్పును వీలైనంత వరకు తగ్గించడం మంచిది. ఉప్పు తక్కువ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు చేరే అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉప్పుని తగ్గించాలి. అలాగే రెడ్ మీట్ కి కూడా దూరంగా ఉండాలి. ఇవి మూత్రంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని పెంచేస్తాయి దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతుంది.

అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా రాళ్ల సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే ఆల్కహాల్ ని తీసుకోకూడదు. అలాగే విటమిన్ సి ఉండే సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఆరోగ్యానికి మంచిదే. కానీ కిడ్నీ రాళ్ల సమస్య ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకూడదు. కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు సోడాకి కూడా దూరంగా ఉండాలి.

సోడా తీసుకోవడం వలన వాళ్లకి ఇబ్బంది కలుగుతుంది. రోజు కూల్డ్రింక్స్ ని సేవించే వాళ్ళలో కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నట్లయితే హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా రోజూ మూడు లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. ఇలా వీటిని ఫాలో అయితే సమస్య ఉండదు అదే ఒకవేళ మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news