ఏడుపాయల వన దుర్గమ్మ చెంత మహిళా అఘోరీ..

-

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళ అఘోరీ మొన్నటి వరకు ఏపీలో సంచరించి ప్రస్తుతం తిరిగి తెలంగాణ బోర్డర్‌కు తిరిగి చేరుకుంది. తాజాగా గురువారం ఉదయం మెదక్ ఏడుపాయల వనదుర్గ ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోరీని చూసేందుకు ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు అక్కడ భక్తులు భారీగా పోటీ పడ్డారు.

సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిమాలయాలను వదిలి దేశంలో పర్యటిస్తున్నానని చెప్పిన అఘోరీ.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన కామెంట్స్ చేస్తూ ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నది. హిందూ దేవాలయాలపైన, బాలికలు, మహిళలపైన దాడులను నిరసిస్తూ నిందితులపై చర్యలు తీసుకోకపోతే ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఆమెను మహారాష్ట్ర బోర్డర్‌లో వదిలేసి రాగా మొన్నటివరకు ఏపీలో సంచరించారు. శ్రీకాళహస్తీలో దిగంబరంగా దర్శనానికి అనుమతించలేదని పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణ చేసుకునేందుకు యత్నించి సంచలనానికి తెరలేపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news