నయీం నివాసానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. సమగ్ర కుల గణన సర్వేలో భాగంగా నయీం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బంజారాహిల్స్ లో జరుగుతోన్న సర్వేలో అధికారులతో కలిసి పాల్గొన్న పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. సమగ్ర కుల గణన సర్వేలో భాగంగా నయీం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు తెచ్చింది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక, దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమేనని పేర్కొన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ వస్తుంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
నయీం నివాసానికి మంత్రి పొన్నం ప్రభాకర్
సమగ్ర కుల గణన సర్వేలో భాగంగా నయీం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన పొన్నం
బంజారాహిల్స్ లో జరుగుతోన్న సర్వేలో అధికారులతో కలిసి పాల్గొన్న పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి#Nayeem #PonnamPrbahakar #CasteCensus #Telangana pic.twitter.com/rv1zsz3U3r
— Pulse News (@PulseNewsTelugu) November 14, 2024