మంత్రుల మాటల మంటలు.. మైనస్సేనా..!

-

మంత్రులు అనేవారు..తమ తమ శాఖలపై పట్టు తెచ్చుకుని..వారి శాఖలకు సంబంధించిన పనులు చేయడం..అలాగే ప్రజలకు సేవ చేయడం. కానీ ఇదంతా ఒకప్పుడు మంత్రులు చేసిన పని..ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. ఇప్పుడు మంత్రులు అంటే..సీఎంకు భజన చేయడం..ప్రతిపక్ష నాయకుడుని బూతులు తిట్టడం. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కాస్త ఇదే సీన్ కనిపించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఇది మరింత ఎక్కువైంది.

అసలు మంత్రులు ప్రత్యేకంగా జగన్‌కు భజన చేయడానికి..చంద్రబాబుని తిట్టడానికి అన్నట్లుగానే ఉన్నారు. మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించి ఏ పనులు చేస్తున్నారో జనాలకు తెలియడం లేదు. ఎందుకంటే వారు ప్రెస్ మీట్ పెడితే బాబుని తిట్టడమో..లేక జగన్‌ని పొగడటమో చేస్తున్నారు. దీని వల్ల కొందరు మంత్రులు అని తెలుస్తున్నారు గాని..వారు ఏ ఏ శాఖలకు సంబంధించిన మంత్రులు అనేది అర్ధం కాకుండా ఉంది. పైగా ఈ మధ్య తనపై, తన ఫ్యామిలీపై విమర్శలు వచ్చినా సరే కొందరు మంత్రులు..చంద్రబాబుని, టీడీపీ వాళ్ళని తిట్టడం లేదని జగన్ మంత్రులకు క్లాస్ ఇచ్చారు.

దీంతో అక్కడ నుంచి మంత్రులు తమదైన శైలిలో తిట్టడం మొదలుపెట్టారు. ఇంతవరకు తిట్టని మంత్రులు కూడా గళం విప్పుతున్నారు. ఆఖరికి రాజన్న దొర లాంటి సౌమ్యంగా ఉండే మంత్రి కూడా పరుషంగా మాట్లాడుతున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వైసీపీని విమర్శించే వారికి పథకాలు ఇవ్వమని చెప్పేస్తున్నారు.

ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్..తాజాగా అమరావతి రైతులపై తీవ్ర పదజాలం వాడారు. పాదయాత్ర చేసేది తొడలు చూపించడానికా? అంటూ మాట్లాడారు. దాడిశెట్టి రాజా ఏమో..ఎన్టీఆర్ చేతకానోడు అని, రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నారని మాట్లాడారు. వీరే కాదు..రోజా, రజిని, జోగి రమేష్, అప్పలరాజు, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, నారాయణస్వామి, కాకాని గోవర్ధన్ రెడ్డి…ఇంకా పలువురు మంత్రులు ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇలా మాట్లాడటం వల్ల వైసీపీకి లాభం వస్తుందో లేదో చూడాలి. వాస్తవ పరిస్తితులని చూస్తుంటే మంత్రులు వల్ల వైసీపీకే మైనస్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version