ఏప్రిల్ లో పీఎం కిసాన్ 2000 రూపాయలు మీకు అందలేదా..? అయితే మీ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ సమాన్ నిధి ఏప్రిల్ జూలై ఇన్స్టాల్మెంట్ ఇంకా అప్రూవల్ అవ్వలేదు. ఈ ఇన్స్టాల్మెంట్ మే 2 వచ్చేటట్టు కనపడుతోంది.
స్టేట్ అప్రూవల్ వెయిటింగ్ అంటే ఏమిటి..?
మీరు మీ మొబైల్ లో లేదా కంప్యూటర్ లో చెక్ చేసినట్లయితే స్టేటస్ కి సంబంధించి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది అంటే దానికి అర్థం ఏమిటంటే..? రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్రూవల్ చేయలేదని.
ఒకవేళ ఎవరికైనా స్టేటస్ లో Rft signed by స్టేట్ గవర్నమెంట్ అని ఉంటే.. ఈ ప్రయోజనం పొందే వాళ్ళ డేటా స్టేట్ గవర్నమెంట్ చెక్ చేసినట్లు ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పంపుతుంది. ఇలా డబ్బులని పంపమని రిక్వెస్ట్ పెడితే అప్పుడు మీకు డబ్బులు అందుతాయి.
ఎనిమిదవ విడత డబ్బులు ఎందుకు ఆలస్యమయ్యాయి..?
ఎనిమిదవ విడత డబ్బులు ఏప్రిల్ – జూలై ఇన్స్టాల్మెంట్ ఈ నెలలో వచ్చేయాలి. అయితే కొన్ని ఇబ్బందులు వల్ల కాస్త ఆలస్యం అయింది. చాలా రాష్ట్రాలు ఇంకా సంతకం చేయలేదు. సరైన వాళ్ళకి డబ్బులు అందడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండడం వల్ల ఇవి ఆలస్యం అయ్యాయి.
ఎనిమిదో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..?
పీఎం కిసాన్ పోర్టల్ లో మీరు చూసినట్లయితే..FTO is Generated and Payment confirmation is pending అని వస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు త్వరలో వచ్చేస్తాయి అని అర్థం. FTO అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. అక్కడ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఇతర డీటెయిల్స్ ని కన్ఫామ్ చేస్తారు. ఆ తర్వాత మీ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి.