బ్రేకింగ్: కొండపల్లిని కైవసం చేసుకున్న టీడీపీ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ కాసేపటి క్రితమే.. పూర్తి అయ్యింది. టిడిపి పార్టీ తరపున చైర్మెన్ అభ్యర్థి గా చిట్టి బాబు బరిలో ఉండగా అధికార వైసీపీ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా… జోగు రాము పోటీ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ చైర్మన్ ఎన్నిక కాసేపటి క్రితమే ముగిసింది. చైర్మన్ ఎన్నిక తోపాటు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఇవాళ నిర్వహించారు ఎన్నికల అధికారులు.

TDP

ఈ ఎన్నికను పూర్తిగా వీడియో తీశారు అధికారులు. అయితే ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు రాగా అధికార వైసీపీ పార్టీకి 15 ఓట్లు వచ్చాయి. ఇక టిడిపి తరఫున ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ కేసినేని నాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు వైసీపీ పార్టీ తరఫున ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వసంత కృష్ణ ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేశినేని నాని ఎక్స్అఫిషియో విషయంలో… వైసిపి వ్యతిరేకించినప్పటికీ… ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఫలితాలను సీల్డ్ కవర్ లో… హైకోర్టుకు తెలపనున్నారు అధికారులు. హైకోర్టు ఆదేశాలు అనంతరం ఫలితాలు బయటపడుతున్నాయి. అయితే పో లైన ఓట్ల ప్రకారం తెలుగుదేశం పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ పై జెండా ఎగురవేయడం ఖాయం గా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version